ఏలూరు కార్పొరేషన్ పీఠం వైఎస్సార్సీపీ దే..

47 డివిజన్లలో అధికార‌పార్టీ గెలుపు

ఏలూరు (CLiC2NEWS): ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఆదివారం జ‌రిగిన ఎన్నిక‌ల ఓట్ల లెక్కిపులో వెల్ల‌డైన ఫ‌లితాల్లో 47 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది.

మొత్తం 50 డివిజ‌న్లు ఉండ‌గా ఎన్నిక‌ల‌కు ముందే మూడు ఏక‌గ్రీవ‌మ‌య్యాయి. దీంతో మార్చి 10న మొత్తం 47 డివిజ‌న్ల‌కే ఎన్నిక‌లు జ‌రిగాయి.
ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఏలూరు శివారులోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

గెలుపొందిన వారి వివ‌రాలు..

  • 2వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కనక నరసింహారావు
  • 4వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డింపుల్‌
  • 12వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ కర్రి శ్రీను
  • 22వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సుధీర్‌బాబు
  • 23వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సాంబ
  • 24వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మాధురి
  • 25వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీనివాస్‌
  • 26వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అద్దంకి హరిబాబు
  • 31వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి లక్ష్మణ్
  • 33వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామ మోహన్
  • 38వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమమాధురి
  • 39వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి జ్యోతి
  • 40వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి స్రవంతి
  • 41వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కల్యాణిదేవి
  • 42వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సత్యవతి
  • 45వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి చంద్రశేఖర్
  • 46వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్యారీ బేగం
  • 48వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి స్వాతి శ్రీదేవి విజయం సాధించారు.

45వ డివిజన్‌ వీరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రతాపచంద్ర ముఖర్జీ కొద్దిరోజుల క్రితం కొవిడ్‌తో మృతి చెందారు.

టీడీపీ విజయం

  • 37వ వార్డులో టీడీపీ అభ్యర్థి పృథ్వీ శారద
  • 47వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి దుర్గా భవాని గెలుపొందారు.
Leave A Reply

Your email address will not be published.