తెలంగాణ వరద బాధితులకు రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన ఉద్యోగులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో వరద కారణంగా దాదాపు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధానికి లేఖ రాశారు. అదేవిధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో తెలంగాణ వరదబాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలోని ఉద్యోగుల తరపున ఒక రోజు వేతనం సుమారు రూ. 100 కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు నిర్ణయింనట్లు సమాచారం. . ఈ మేరకు ఉద్యోగుల జెఎసి ఛైర్మన్ ప్రకటించారు.