AP: ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: సిఎస్

అమరావతి (CLiC2NEWS): ఉద్యోగుల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. వేతన సవరణపై ఎపి ప్రభుత్వం చర్చలు జరిపింది. సచివాలయంలో ఆర్థిక శాఖ, ఇతర శాఖల కార్యదర్శులతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. పిఆర్సీతో పాటు ఆర్థికేతర అంశాల వారీగా సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వీలైనంత త్వరగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కార్యదర్శులను ఆదేశించారు.