అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ క్రికెటర్

Sports: ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అతను ఇంగ్లాండ్ తరపున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 1074, వన్డేల్లో 1450, టి20ల్లో 1892 పరుగులు చేశాడు. 37 ఏళ్ల మలన్ టి20లో మంచి రికార్డును సొంతం చేసుకున్నాడు. పురుషుల క్రికెట్ పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా (24 ఇన్నింగ్స్‌లోనే) 1000 పరుగులు పూర్తి చేశాడు. 2020 సెప్టెంబర్‌లో టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. భారత్‌లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత మలన్ తిరిగి ఇంగ్లాండ్ జట్టుకు ఎంపిక కాలేదు.