కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ ఉంటేనే క‌ర్ణాట‌క‌లోకి ఎంట్రీ!

బెంగ‌ళూరు (CLiC2NEWS): సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గినా.. దేశంలో ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్ప‌టికే దాదాపు 10 రాష్ట్రాల్లో ఈ కొత్త వేరిట్‌ కేసులు నమోద‌య్యాయి. కేంద్రం ఈ కొత్త వేరింట్ కేసులు వ‌చ్చిన రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది.

మహారాష్ట్రలో డెల్టా కేసులు పెరుగుతున్న తరుణంలో కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో పోలీసు, వైద్యశాఖ సంయుక్తంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. క‌రోనా నెగ‌టివ్ రిపోర్టు ఉన్న‌వారినే మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి రావాలి అనే నిబంధన పెట్టారు. అలాగే కేరళ సరిహద్దులోనూ ఇదే తరహా ఆంక్షలను అధికారులు కొనసాగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.