మేడిగ‌డ్డ పిల్ల‌ర్ కుంగిన ఘ‌ట‌న‌పై వివ‌రాలివ్వండి: హైకోర్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): మేడిగ‌డ్డ పిల్ల‌ర్ కుంగిన ఘ‌ట‌న‌పై వివ‌రాలివ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. రెండు వారాల్లో వివ‌రాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాదికి జారీ చేసింది. మేడిగ‌డ్డ ఘ‌ట‌న‌పై సిబిఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కాంగ్రెస్ నేత నిరంజ‌న్ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. మ‌హాదేవ‌పురం పిఎస్‌లో న‌మోదైన కేసును సిబిఐకి బ‌దిలీ చేయాల‌ని పిటిష‌న్లో ఆయ‌న పేర్కొన్నారు. పిల్ల‌ర్ కుంగిన ఘ‌ట‌న‌పై నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటికి ప‌లు ఫిర్యాదులు రావ‌డంతో రాష్ట్ర సిఎస్‌కు డ్యామ్‌సేప్టి అథారిటి లేఖ రాసింది. ఈ నేప‌థ్యంలో సిఎస్ శాంతి కుమారి నుండి స‌మాచారం తీసుకొని వివ‌రాలు ఇవ్వాల‌ని ఉన్న‌త న్యాయ‌స్తానం ఆదేశాలు జారీ చేస్తూ విచార‌ణ‌ను రెండు వ‌రాల‌కు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.