విదేశాంగ మంత్రికి క‌రోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. సామాన్యుల‌నుండి సెల‌బ్రిటీల వ‌ర‌కు.. క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి డాక్ట‌ర్ ఎస్ జైశంక‌ర్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యం గా ట్విట్ట‌ర్ వేదికగా ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మంత్రి సూచించారు.
దేశంలో కొవిడ్ విజృఃభ‌ణ కొన‌సాగుతోంది. తాజాగా దేశంలో 2.86 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.