సిద్దిపేట: తహసీల్దార్ కార్యాలయంలో రైతుల బైఠాయింపు

సిద్దిపేట (CLiC2NEWS): చెక్కులిచ్చే వరకు కదిలేదే లేదని రైతులు తహసీల్దార్ కార్యాలయంలో బైఠాయించారు. జిల్లాలోని మల్లన్న సాగర్ అదనపు టిఎంసి కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు తహసీల్దార్ కార్యాలయంలో అందోళనకు దిగారు. చెక్కులు ఇచ్చేందుకు తహసీల్దార్ నిరాకరించడంతో కార్యాలయంలోనే భీష్మంచుకు కూర్చున్నారు. ఘనపురానికి చెందిన 70 మంది రైతులు భూపరిహార చెక్కుల కోసం ఉదయం 10 గంటల నుండి పడిగాపులు పడుతున్నారు. దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అక్కడికి చేరుకుని తహసీల్దార్‌తో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేస్తామని తెలియజేశారు. పరిహారం చెక్కులు తహసీల్దార్ కార్యాలయానికి వస్తే కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వెళ్లి తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇక్కడే చెక్కులు పంపిణీ చేస్తే.. వెళ్లిపోతామన్నారు.