మహిళా ఎస్సై భవానీ ఆత్మహత్య
విజయనగరం (CLiC2NEWS): విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల క్వార్టర్స్‌లో మహిళా ఎస్.ఐ కె.భవాని (25) తన గదిలో శనివారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. అవివాహిత అయినా మహిళా ఎస్.ఐ భవానీ కృష్ణాజిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందినది. ప్రస్తుతం సఖినేటిపల్లి మహిళా ఎస్సై గా కె.భవానీ విధులు నిర్వహిస్తున్నది.
క్రైమ్ శిక్షణ నిమిత్తం 5 రోజుల కిందట విజయనగరం వచ్చారు. శనివారం శిక్షణ పూర్తయింది. ఆదివారం తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. ఈ క్రమంలో భవాని హత్యకు పాల్పడటం కలకలం రేపింది.
భవానీ 2018 బ్యాచ్‌కు చెందిన అధికారిణి భవాని స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం. విశాఖపట్నంలో ఉన్న సోదరుడు శివకు చివరిసారి ఫోన్ చేసి శిక్షణ పూర్తయిపోయినట్లు చెప్పిందని తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని విజయనగరం డీఎస్పీ పి.అనిల్‌కుమార్ తెలిపారు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ఉద్యోగంలో సమస్యలా లేక కుటుంబ సమస్యలా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎస్.ఐ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.