గ్యాస్ సిలిండర్ పేలి 15 మందికి గాయాలు..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని నానక్‌రామ్ గూడలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేసట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా యూపి, బీహార్‌కు చెందినవారు నగరానికి వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.