నేటినుండి సినిమా షూటింగ్స్ బంద్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): సినిమా చిత్రీక‌ర‌ణ‌ల‌ను రేప‌టి నుండి నిలిపివేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ అధ్యక్షుడు బ‌సిరెడ్డి తెలిపారు. కొల్లి రామ‌కృష్ణ ప‌ద‌వీకాలం ముగియ‌డంతో నూత‌న అధ్యక్షుడుగా కొత్తా బ‌సిరెడ్డి ఎన్నికయ్యారు. ఫిల్మ్ ఛాంబ‌ర్‌లోని 48 స‌భ్యుల‌తో స‌ర‌వ్స‌భ్య స‌మావేశం నిర్వ‌హించి.. సంపూర్ణ మ‌ద్ద‌తుతో సినిమా చిత్రీక‌ర‌ణ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం తెలిసే వ‌ర‌కూ షూటింగ్స్ మొద‌లు కావ‌ని అన్నారు. దీంతో అగ్ర హీరోల సినిమా షూటింగ్స్ సైతం నిలిచిపోనున్నాయి. కానీ ఇత‌ర భాషా చిత్రాల‌కు ఎటువంటి అడ్డంకి ఉండ‌బోద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.