తుర్కపల్లి సమీపంలో కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

భువనగిరి (CLiC2NEWS): యాదగిరి గుట్టకు వెళుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. కారులోని ప్రయాణికులను దించేయడంతో ప్రమాదం తప్పింది. యాదగిరి గుట్ట దైవ దర్శనానికి వెళ్లేందుకు కొందరు కారులో బయలుదేరారు. గజ్వేల్ నుండి భవనగిరి వెళ్లే దారిలో వారు ప్రయాణిస్తున్న కారులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. గమనించిన వారందరూ కారులోంచి దిగిపోయారు. దీంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు పైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.