పూరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

నందుర్భర్ (CLiC2NEWS): గాంధీధామ్-పూరీ ఎక్స్‌ప్రెస్ రైల్లోని ప్యాంట్రీ బోగీలో మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని నందర్భర్ స్టేషన్ సమీపంలో సూపర్ ఫాస్ట్ రైలుఓ ప్యాంట్రీ కార్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. వెంటనే స్పందించిన రైలు సిబ్బంది రైలును తక్షణమే అపి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రమాదానికి గురైన బోగీలను ఎక్స్‌ప్రెస్ రైలునుండి డిటాచ్ చేసినట్లు వెస్ట్రన్ రైల్వే చీఫ్ ప్రతినిధి తెలిపారు.