ఆళ్లగడ్డలో కారు ప్రమాదం.. నవదంపతులు సహా ఐదుగురు దర్మరణం

హైదరాబాద్ (CLiC2NEWS): శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదంలో నవ దంపతులు సమా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురం మంత్రి రవీందర్ కుమారుడు వివాహం గత నెల 29వ తేదన జరిగింది. ఈ నెల 3వ తేదీన రిసెప్షన్ జరిగింది. 4వ తేదీన తిరుమలకు వెళ్లారు. దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఆళ్లగడ్డ సమీపంలోవారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రవీందర్, ఆయన భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్‌కిరణ్ అక్కడికక్కడే మృతి చెందారు.