అమెరికాలో చదువు కోసం వెళుతున్నారా..
భారీగా పెరిగిన విమానయాన ఛార్జీలు..

అనంతపురం (CLiC2NEWS): విదేశాలకు ఫ్లైట్ టికెట్ ధరలు పెరగడంతో విదేశాలకు వెళ్లాలనుకునే వారు, ముఖ్యంగా అమెరికా వెళ్లి చదువుకోవాలనుకొనే వారు అందోళన చెందుతున్నారు. విమాన ఛార్జీలు 60 నుండి 70 శాతం వరకు పెరిగాయి. కొవిడ్‌కు ముందు అమెరికాకు విమాన ఛార్జీ రూ. 80వే నుండి రూ. 90 వేల వరకూ ఉండేది. పెరిగిన ధరలతో కనీసం రూ. 1.60లక్షలు వెచ్చించాల్సి ఉంది. దీంతో విదేశాలలో చదువుకునే వారు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుండి ఈ ఏడాది 280 మంది విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళుతున్నారు. రోజురోజుకూ ఛార్జీలు పెరుగుతున్నాయని గత రెండు నెలల్లో పెరగడమే గాని తగ్గలేదని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. అమెరికాలో సెప్టెంబర్ నుండి విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీంతో ఆగస్టు 25 నాటికి అక్కడికి చేరుకోవాలి.