వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి: సిఎం రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, రైళ్ల మార్గాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ప్రయాణికులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో వరద ఉద్ధృతికి పలు ప్రాంతాలు వాగులను తలపిస్తున్నాయి. కలనీలు నీటమునిగాయి. ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాలకు వెళ్లారు.
రాష్ట్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి సిఎం లేఖ రాశారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్రానికి తక్షణ సాయం అందజేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.