షేక్.బహర్ అలీ: ఒత్తయిన నల్లని కురుల కోసం..

చలికాలంలో శరీరం చలికి ముడతలు పడటం, స్కిన్ పగలటం, తలలో వెంట్రుకలు ఊడటం, చుండ్రు, తెల్లవెంట్రుకలు రావటం లాంటివి జరుగుతుంటాయి.
వీటి నివారణకు మరియు అలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఆవాల నూనెతో మనం ఇలా చేస్తే చాలు పైన వున్న రోగాలు ఏమిరావు.
మనం చిన్నపుడు అమ్మమ్మలు, నానమ్మలు, మన తలకు ఆవాల నూనె కానీ ఆముదం కానీ రాసి తలను కొద్దిగా మాలిష్ చేసేవారు, దానితో వెంట్రుకలు ఘనంగా పెరిగేవి, నల్లగా ఉండేవి.
ఆవాల నూనెలో అంటి ఆక్సిడెంట్, అంటి ఫంగల్, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ క్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్, మినరల్స్ పోషకాలు.
ఆవాల నూనె తల వెంట్రుకలకు రాయటం, మరియు కుదుళ్లకు పట్టించటం, మరియు జడ బారుగా ఉంటే దానికి కూడా పట్టించటం వలన వెంట్రుకలు ఏపుగా, నల్లగా, ఒత్తుగా, పెరిలుగుతాయి. వెంట్రుకలకు చక్కని విటమిన్స్, మినరల్స్ అందుతాయి. నేచరల్ గా అందంగా కనపడతాయి.
డేండ్రాఫ్ వున్నవారికి తలకు షాంపూ రాసి తల స్నానం చేస్తే వెంట్రుకలు వుండిపోతాయి. కనుక దానికంటే ముందుగా అంటే తల స్నానం చేసే ముందు వెంట్రుకలకు ఆవాల నూనె పట్టించి 10 నిముషాలు వదిలివేయండి, తరువాత షాంపూతో స్నానం చేయండి, చుండ్రు తగ్గుతుంది, వెంట్రుకలు రాలిపోవటం ఆగుతాయి. మరియు వెంట్రుకలు చక్కగా నిగనిగాలాడుతూ ఉంటాయి. వెంట్రుకలు 60యేండ్ల దాక తెల్లగా మారవు, బట్ట బుర్ర త్వరగా రాదు. తలలో ఇన్ఫెక్షన్ ఉంటే అది తగ్గిపోతుంది.
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు,
సెల్ 7396126557