విదేశీ ప్రయాణికులకు 7రోజుల క్వారంటైన్ అవసరం లేదు..!
కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రప్రభుత్వం

ఢిల్లి (CLi2NEWS): దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజులుగా రోజువారి కొత్త కేసులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుండి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు మార్గదర్శకాలను కేంద్రప్రభుత్వం సవరించింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ నిబంధనను తొలగించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే 14 రోజుల స్వీయ పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఈ సమయంలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్‌లో ఉండాలి.
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొన్ని దేశాలను ‘ఎట్ రిస్క్’ గా పరిగణించారు. ఇప్పుడా కేటగిరిని తీసివేసింది. ఈమేరకు సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాలు ఈ నెల 14వ తేదీ నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.