తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యాకమిషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రి ప్రైమరి నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసి తయారీకి ఈ కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. కమిషన్ ఛైర్మన్, సభ్యులను త్వరలో నియమించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాబోతున్నట్లు సిఎం రేవంత్ తెలిపిన విధంగా విద్యాకమిషన్ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది.