అనంతపురం జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు వ్యవసాయ కూలీలు మృతి

రాయదుర్గం (CLiC2NEWS): అనంతపురం జిల్లాలో వ్యవసాయ కూలి పనులకు వెళ్లిన వారిపై కరెంట్ తీగ తెగిపడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం, బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో మొక్కజొన్న కంకులు కోయడానికి వెళ్లిన వ్యవసాయ కూలీలపై విద్యుత్ తీగ తెగిపడి నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.