కరీంనగర్‌లో కారు ప్రమాదం: నలుగురు మృతి
కారు యజమాని సహా.. ముగ్గురు మైనర్లు అరెస్ట్

కరీంనగర్ (CLiC2NEWS): నగరంలోని కమాన్ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన కొలిమి పనులు చేస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం కారును వదిలేసి నలుగురు పరారయ్యారు. కారుపై 9 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కారు యజమాని రాజేంద్రప్రసాద్ సహా. ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశామని కరీంనగర్ సిపి సత్యనారాయణ తెలిపారు. కారు యజమాని కొడుకు కారును నడిపి ప్రమాదానికి కారణమైనట్టు తెలిసింది. మైనర్లకు కారును అందుబాటులో ఉంచినందుకు యజమానిపై కూడా కైసు నమోదు చేశారు.