పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/accident-copy-750x313.jpg)
పల్నాడు (CLiC2NEWS): జిల్లాలో ఆదివారం సాయంత్రం కూలీలను తీసుకెళుతున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయలైయ్యాయి. మృతి చెందిన వారంతా మహిళా కూలీలే. జిల్లాలోని ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలవ కట్టపై కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్‌లో ఉన్న కూలీలు ముప్పాళ్ల మండలంలోని చాగంటి వారిపాలెం గ్రామానికి చెందినవారు. మిరప కోత పనికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.