Rajanna Sircilla: మల్యాల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం
గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ అండ్ యంగ్ మైండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం
చందుర్తి (CLiC2NEWS): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం మల్యాల గ్రామంలో యంగ్ మైండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ గుమ్మడి కిరణ్ ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. అంధులకు పరీక్షల నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర కంటి సమస్యలతో బాధపడుతున్నందున వారికి తన వంతు సాయంగా ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మల్యాలలో ఇట్టి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. వృద్ధులకు,అంధులకు కంటి పరీక్షలు నిర్వహించి మందులు, కంటి అద్దాలు అందివ్వడం జరిగింది. మధు, బాలేశం, ప్రతిభ విద్యాలయం కరస్పాండెంట్ ప్రిన్సిపల్, కొడగంటి గంగాధర్, కొనరమేష్ కో ఆర్డినెన్స్ లో ఉచిత కంటి శిబిరం సుమారు 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్ల లెష్మినారాయన, ఎంపిటిసి మందాల అబ్రహం, వార్డు సభ్యులు, అటో యూనియన్ అధ్యక్షుడు ఈసరి శ్రీనివాస్,ఎంగ్ మైండ్ ఫౌండేషన్ సభ్యులు రవితేజ, గణేష్, రాహుల్, ఆదర్శ్, రాకేష్ ,ఉదయ్ గణేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.