లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోఈ నెల 25న ఉచిత వైద్య శిబిరం..

మండపేట (CLiC2NEWS): మండపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 25 న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్అ ధ్యక్షులు వాదా ప్రసాదరావు తెలిపారు. స్థానిక సత్యశ్రీ రోడ్ లోని లైన్స్ కళ్యాణమండపంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. మంగళవారం లయన్స్ క్లబ్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వాదా ప్రసాదరావు మాట్లాడుతూ హైదరాబాద్ ఏవీస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కాళ్ళలో నరాల వాపు, బోదకాలు, తదితర వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తారని తెలిపారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా వైద్య శిబిరానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. లైన్స్ క్లబ్ కార్యవర్గం సభ్యులు గుండు వీరతాతరాజు, కురసాల సత్యనారాయణ, కర్రి నారాయణ రెడ్డి, క్లబ్ మేనేజర్ అబ్బాస్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.