ముగిసిన రావత్ దంపతుల అంత్యక్రియలు

ఢిల్లీ: ఢిల్లీ కంటోన్మెంట్ ప్రంతంలో బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో రావత్ దంపతుల పార్థివదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. వారి కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం పార్థివదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సిడియస్ రావత్ అంత్యక్రియల్లో 800 మంది సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆయనకు గౌరవసూచికంగా 17గన్ సెల్యూట్‌తో ఘనంగా నివాళులర్పించారు. రావత్ అంత్యక్రియలలో పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పలు దేశాల సైనిక ఉన్నతాధికారులు పాల్గొని నివాళులర్పించారు.