విషాదం: జెన్‌కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య
![](https://clic2news.com/wp-content/uploads/2020/11/sucide.jpg)
నల్లగొండ (CLiC2NEWS) : నాగార్జున సాగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం అదృశ్యమైన జెన్‌కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఇద్దరు దంపతులు, కుమారుడు ఉన్నారు. మా చావుకు మేమే కారణమంటూ సూసైడ్ నోట్‌లో వారు పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం చింతలపాలెం వద్ద కృష్ణా నదిలో బాలుడు సాత్విక్ మృతదేహం లభ్యమైంది. దంపతులు రామయ్య, నాగమణి మృతదేహాల కోసం గజఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా జెన్ కో ఉద్యోగి కుటుంబం నిన్న సాయంత్రం కొత్త బ్రిడ్జిపై నుంచి కృష్ణా నదిలో దూకినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు అనారోగ్య కారణాల వల్లనే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు, బంధువులు భావిస్తున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![](https://clic2news.com/wp-content/uploads/2021/07/satwik.jpg)