ఘనంగా పిఎంపి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు..

మండపేట (CLiC2NEWS): పట్టణంలో పిఎంపి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ది పిఎంపి అసోసియేషన్ మండపేట, ఆలమూరు మండలాల ఆధ్వర్యంలో టౌన్ హాల్ వద్ద గల ఉషా క్లినిక్ నందు ఈ వేడుకలు నిర్వహించారు. మంగళవారం పిఎంపి అసోసియేషన్ 59వ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ అధ్యక్షతన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ కే భరద్వాజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీనియర్ సభ్యులు ఏడిద లక్ష్మణాచార్యులను దుస్సాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, సుంకర బాలాజి, మేకా రామకృష్ణ, పిల్లా సతీష్, జట్టి స్వప్న కుమార్, మేకా సత్యనారాయణ పిఎంపిలు పాల్గొన్నారు.