గాడ్‌ఫాదర్: ‘తార్‌మార్ సాంగ్’ ఫుల్ వీడియో రిలీజ్

హైదరాబాద్ (CLiC2NEWS): చిరు-సల్మాన్ కలిసి స్టెప్పులేసిన సాంగ్ ‘తార్‌మార్ తక్కర్ మార్ ‘పూర్తి పాట వీడియో విడుదలైంది. చిరంజీవి కథానాయకుడుగా నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న విడుదలై విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసినదే. చిత్రంలోని చిరు- సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేసిన పాటను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పూర్తి వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, నయనతార, పూరీ జగన్నాథ్ కీలక పాత్రలు పోషించారు.