Gold: తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు శుభవార్త

ఢిల్లీ (CLiC2NEWS): గత కొన్ని రోజులుగా పెరిగిన పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని నగరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.861లు తగ్గి రూ.46,863కి చేరింది. వెండి ధర కూడా రూ.1,709లు తగ్గి 68,798కి చేరింది.
ఇక హైదరాబాదులో స్వచ్ఛమైన బంగారం రూ.49,470లు కాగా 22 కారెట్ల బంగారం ధర రూ.45,350లు ఉంది. కిలో వెండి ధర రూ.70,240లు ఉంది.