Gold: మహిళలకు శుభవార్త.. ధరలు తగ్గాయి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఈ మ‌ధ్యకాలంలో పసిడి ధరలు దిగొస్తున్నాయి.  ఇక పెళ్ళీళ్ల సీజన్ ప్రారంభంలోనే పసిడి ధరలు తగ్గడమనేది బంగారం ప్రేమికులకు కాస్తా ఊరట కలిగించే అంశం. గతేడాది కరోనా సమయంలో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది కూడా దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అనుకున్నా, ప్రస్తుతం మాత్రం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 140 తగ్గి రూ. 44,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 190 తగ్గి, రూ.48,460కి చేరింది. బంగారం ధర తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ. 74,000కి చేరింది.

బుధవారం ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,450 ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల రూ.48,460గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో రూ.44,450 ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల రూ.48,460గా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,180గా ఉంది. ఇక ముంబ‌యిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,800గా ఉంది. అలాగే చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,650 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,710గా కొనసాగుతుంది.

Leave A Reply

Your email address will not be published.