65వేలకు పెరిగిన బంగారం ధర..

ఢిల్లీ (CLiC2NEWS): బంగారం ధర రూ. 65 వేలకు చేరింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర మంగళవారం ఒక్కసారిగా రూ. 800 మేర పెరిగి రూ. 65వేలకు పెరిగింది. అదేవిధంగా వెండి ధరకు కూడా రెక్కలొచ్చాయి. కెజి వెండి ధర రూ. 900 మేర పెరిగి రూ. 74,900కు చేరింది. అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గి.. జూన్ నుండి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగినట్లు సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ వెల్లడించారు.