రూ.80వేలు దిగువకు బంగారం
Gold Price: ఇటీవల పసిడి ధర రూ.82వేలకు చేరిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం బంగారం ధర తగ్గి రూ.79వేలకి చేరింది. స్వచ్ఛమైన 10గ్రాముల బంగారం ధర రూ.79,100 గా ఉంది. ఇదే తరహాలో వెండి కూడా తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ నెలలో కిలో వెండి ధర రూ.లక్షకు పైమాటే. తాజాగా వెండి ధర రూ. 92,700కు చేరింది. కిందటి నెలలో బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో దసరా, దీపావళి పర్వదినాలలో ఆశించినంత మేర అమ్మకాలు లేవు. గతేడాదితో పోలిస్తే ఈ దీపావళి కి 15% తగ్గాయని అంచనా వేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున డాలర్ మరింత బలోపేతం అవుతుందని భావవిస్తున్నారు. డాలర్ విలువ ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయి అయిన రూ.84.30కి చేరింది.