పసిడి ప్రియులకు శుభవార్త..

హైదరాబాద్ (CLiC2NEWS): బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 650 తగ్గి రూ. 57,550 వద్ద స్థిర పడినట్లు సమాచారం. అంతేకాకుండా వెండి ధర కూడా రూ. 1800 తగ్గి.. రూ. 71,500గా ఉంది. ఇప్పటి వరకు రూ. 60వేలకు పైగా ఉన్న బంగారం ధర గత కొన్ని రోజుల నుండి స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. దీంతో బంగారం అమ్మకాలు దుకాణదారులు ఊపందుకుంటాయని అభిప్రాయపడుతున్నారు.