రూ. 5 ల‌క్ష‌ల ఖ‌రీదైన బంగారు మాస్క్..

కాన్పూర్ (CLiC2NEWS): ప్ర‌స్తుతం మాస్క్ మ‌నిషి జీవితంలో భాగ‌మైపోయింది. ఏది ఉన్నా లేకున్నా బ‌య‌ట‌కు వెళ్తే మాస్కు త‌ప్ప‌ని స‌రి. మాస్క్‌లేనిదే మ‌నుగ‌డ‌లేదు. ఆ మాస్క్‌ల‌లో స‌ర్జిక‌ల్ మాస్క్‌, ఎన్‌95 మాస్క్‌, క్లాత్ మాస్క్‌, డబుల్ మాస్క్‌.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మ‌నోజ్ సెంగార్ ఏకంగా బంగారు మాస్క్‌నే చేయించుకున్నారు.

గోల్డెన్ బాబాగా పేరుగాంచిన మ‌నోజానంద మ‌హారాజ్ అలియాస్ మ‌నోజ్ సెంగార్ బంగారు ఏకంగా మాస్క్ ధ‌రించారు. ఆ మాస్క్ ఖ‌రీదు అక్ష‌రాలు రూ. 5 ల‌క్ష‌లు. దేశవ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు స‌రైన రీతిలో మాస్క్‌లు ధ‌రించ‌డంలేద‌ని, తాను చేయించుకున్న బంగారు మాస్క్ ట్రిపుల్ కోటింగ్ ఉంద‌ని తెలిపారు. అలాగే అది పూర్తిగా శానిటైజ్ అయిన‌ట్లు కూడా గోల్డెన్ బాబా పేర్కొన్నారు. క‌నీసం మూడేళ్ల పాటు ఆ మాస్క్ ప‌నిచేస్తుంద‌ని గోల్డెన్ బాబా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.