గుడ్ న్యూస్: తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ (CLiC2NEWS): నిన్నటి రోజున భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు (బుధవారం) తిగిరి తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు దిగి వస్తున్నప్పటికీ, వెండి మాత్రం పెరుగుతూనే ఉన్నది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగి వస్తుండటంతో దేశీంగా ధరలు తగ్గుతున్నాయి. భారతీయులు బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తారు.. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బంగారం తమను ఆదుకుంటుందని కూడా భావిస్తారు. అందుల్లనే బంగారంపై వివిధ రూపాయల్లో పెట్టుబడి పెట్టడానిఇక మక్కువ చూపిస్తారు. ముఖ్యంగా వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.
ప్రస్తుతం తగ్గిన ధరల ప్రకారం నగరంలోని బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు ఇలా ఉన్నాయి.
- 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 150 తగ్గి రూ.43,200కి చేరింది.
- 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 160 తగ్గి రూ.47,130 కి చేరింది.
- ఇక కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.64,700కి చేరింది.