ఎపి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు కొత్త డిఎ విడుదలకు ఆమోదం తెలిపింది. 2019 జూలై నుండి చెల్లించాల్సిన 5.24 శాతం డిఎని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన డిఎని 2022 జనవరి జీతానికి జమ చేయనున్నట్లు తెలిపింది. డిఎలో 10 % ప్రాన్ ఖాతాలకు, మిగతా 90% నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లంచనున్నట్లు వెల్లడించారు. జడ్పి, మండల, పరషత్‌లు, గ్రామ పంచాయతీలు, అన్ని ఎయిడెడ్ సంస్థలు, విశ్వవిద్యాలయాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా ఈ డిఎ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొంది.