AP: ఆస్తిపన్ను వడ్డీలో 50శాతం రాయితీ..

అమరావతి (CLiC2NEWS): ఆస్తిపన్ను బకాయిదారులకు ఎపి మున్సిపల్ శాఖ శుభవార్త తెలిపింది. ఆస్తిపన్ను పై వడ్డీలో రాయితీని ప్రకటించి ఆస్తిపన్ను బకాయిదారులకు ఊరట కలిగించింది. మార్చి నెలకరు వరకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ బాకాయిల్లో 50% రాయితీ కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రజల నుండి కోట్లాది రూపాయలు ఆస్తి పన్ను బాకాయిలను వసూళ్ల కోసం ఈ వడ్డీ రాయితీ నిర్ణయం తీసుకుంది. ప్రజల నుండి వస్తున్నవిజ్ఞప్తులు, వినతులు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.