GoodNews: త్వరలో అర్హుల‌కు కొత్త రేషన్‌ కార్డులు

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ సర్కార్ శుభ‌వార్త చెప్పింది. రేషన్ కార్డుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వారి స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అర్హుల‌కు రేష‌న్ కార్డులు మంజూరు చేయాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది. ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అధ్యక్షతన మంగ‌ళ‌వారం ప్రగతిభవన్‌లో సమావేశమైన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయడానికి కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,46,169 మంది అర్హుల‌కు రేష‌న్ కార్డుల‌ను అధికారులు అంద‌జేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.