GoodNews: త‌గ్గిన‌ బంగారం ధరలు..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తగ్గిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 43,900కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి 47,890 కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1300 తగ్గి రూ.74,000కి చేరింది.

గత రెండు రోజులుగా బంగారం ధర పరుగులు పెట్టింది. అయితే బంగారం ధర పెరిగినా కూడా రికార్డు స్థాయి నుంచి చూస్తే.. పసిడి రేటు ఇంకా దిగువ స్థాయిలోనే కదలాడుతోంది. తాజాగా గురువారం బంగారం ధర తగ్గింది. దేశీయంగా పరిశీలిస్తే.. 10 గ్రాముల బంగారంపై రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,280 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,280 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.45,280 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,160 ఉంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది.

రికార్డు స్థాయి నుంచి రూ. 11 వేల వరకు పతనమైన వెండి రేటు
వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర తాజాగా దిగి వచ్చింది. అయితే వెండి ధర గత సంవత్సరం ఆగస్టు నెలలో కిలోకు రూ. రూ.79,980 స్థాయికి చేరింది. అంటే అప్పటి నుంచి చూస్తే వెండి ధర ఏకంగా రూ.11 వేలు పతనమైంది. ప్రస్తుతం దేశీయంగా చూస్తే వెండి ధర రూ.69,700 వద్ద కదలాడుతోంది. అయితే తాజాగా గురువారం వెండి ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో రూ.300 నుంచి 400 వరకు తగ్గగా, హైదరాబాద్‌లో ఏకంగా రూ.1300 వరకు తగ్గముఖం పట్టింది. ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,700 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.69,700 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.74000 ఉండగా, కోల్‌కతాలో రూ.69,700 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, కేరళలో రూ.67,700 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, విజయవాడలో రూ.74,000 ఉంది.

Leave A Reply

Your email address will not be published.