Hyderabad: న‌గ‌రంలో గూగుల్ ఎఐ కేంద్రం.. సంస్థ అవ‌గాహ‌న ఒప్పందం

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎఐ కేంద్రం ఏర్పాటు కానుంది. గురువారం రాష్ట్ర ప్ర‌భుత్వంతో గూగుల్ సంస్థ అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది. న‌గ‌రంలోని టిహ‌బ్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సిఎం రేవంత్ రెడ్డి, ఐటి మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు పాల్గొన్నారు. సిఎం స‌మ‌క్షంలో గూగుల్ ప్ర‌తినిధులు ఎంఒయు కుదుర్చుకున్నారు. ఈ మేర‌కు గూగ‌ల్ సంస్థ ప్ర‌క‌టించింది. వ్వ‌వ‌సాయం, విద్య, ర‌వాణా, ప్ర‌భుత్వ డిజిట్ కార్య‌క‌లాపాల‌కు గూగుల్ ఎఐ కేంద్రం స‌హ‌క‌రిస్తుందని, కృత్రిమ మేధ అంకుర ప‌రిశ్ర‌మ‌ల‌కు గూగుల్ తోడ్పాటు నందించ‌నున్న‌ట్లు సంస్థ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.