గ‌వ‌ర్న‌ర్ ప్ర‌తిభా పుర‌స్కారాలు – 2024 జాబితా..

హైద‌రాబాద్ (CLiC2NEWS): జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే సంద‌ర్బంగా ప్ర‌తి ఏటా నాలుగు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు పుర‌స్కారాలు ఇవ్వాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌తిభా పుర‌స్కారాలు-2024 కు ఎంపిక చేసిన జాబితాను గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ప్ర‌క‌టించింది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, దివ్యాంగుల సంక్షేమం, క్రీడ‌లు, సాంస్కృతి విభాగాల్లో గ‌త ఐదేళ్లుగా ఉత్త‌మ సేవ‌లు అందిస్తున్న వారికి ఈ పుర‌స్కారాలు అంద‌నున్నాయి. ఈ నెల 26న తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఈ అవార్డుల‌ను అందజేయ‌నున్నారు. ఈ అవార్డు కింద రూ.2ల‌క్ష‌లు, జ్ఞాపిక‌ను అంద‌జేస్తారు.

ప్ర‌తిభా పుర‌స్కారాల‌కు ఎంపిక‌పైన వారు..

అరిక‌పూడి ర‌ఘు,

దుశ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ‌,

ప్రొఫెస‌ర్‌ ఎం. పాండురంగారావు, పి.బి. కృష్ణ‌భార‌తికి సంయుక్తంగా

పారా ఒలింపిక్ విజేత జీవాంజిదీప్తి,

ధ్రువాంశు ఆర్గ‌నైజేష‌న్‌

ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్ప‌త్రి

ఆదిత్య మెహ‌తా ఫౌండేష‌న్

సంస్కృతి ఫౌండేష‌న్

Leave A Reply

Your email address will not be published.