రాజ్‌భవన్: బతుకమ్మ వేడుల్లో గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ (CLiC2NEWS): అంతర్జాతీయంగా బుధవారం నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని రాజ్ భవన్‌లో కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తమిళి సై సౌందరరాజన్, కుటుంబ సభ్యులు, రాజ్ భవన్ మహిళ ఉద్యోగులంతా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రజలకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగను గవర్నర్‌గా, తెలంగాణ ఆడపడుచుగా రాజ్ భవన్‌లో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. 9 రోజుల పాటు తెలంగాణ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.