ఎపిలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలు..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను ఎపిపిఎస్‌సి ప్రకటించింది. ఈ ఏడాది మేలో పరీక్షలు నిర్వహించనున్నారు. మే 3 నుండి 9 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌లో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఎపిపిఎస్‌సి కార్యదర్శి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 81 గ్రూప్ -1 పోస్టులు ఉన్నాయి. గతేడాది మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.