గులాబ్ ఎఫెక్ట్: కుండపోత వర్షం

హైదరాబాద్ (CLiC2NEWS): గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా కుండపోత వాన కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి. సాయంత్రం సమయం కావడంతో కార్యాలయానుంచి ఇంటికి బయలు దేరిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, పాతబస్తీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్, ఎల్‌బీనగర్, నాగోల్, మన్సూరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. వనస్థలీపురం, బీఎన్‌రెడ్డినగర్, తుర్కయాంజల్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఈఎస్‌ఐ, రహమత్‌నగర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మణికొండ, ఫిల్మింనగర్, యూసుఫ్‌గూడ, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, రామంతాపూర్, అంబర్‌పేట, మలక్‌పేట, పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కాగా నగరంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం నగర వాసులకు హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో మరికొద్ది గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.