గుంటూరు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు నెల రోజులు జైలు శిక్ష: ఎపి హైకోర్టు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు.. గుంటూరు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కి నెల రోజుల జైలు శిక్ష‌, రూ.2వేలు జ‌రిమానా విధించింది. కోర్టు ధిక్క‌ర‌ణ గుంటూరు కార్పొరేష‌న్ ప‌రిధిలోని య‌డ‌వ‌లి వారి స‌త్రాన్ని ఆక్ర‌మించుకొని ఎటువంటి లీజ్ చెల్లించ‌కుండా స్కూల్‌ను న‌డుపుతున్నార‌ని న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లైంది. విచార‌ణ జ‌రిపిన హైకోర్టు .. పిటిష‌న‌ర్‌ల‌కు రూ. 25 ల‌క్ష‌లు చెల్లించాల‌ని ఆదేశించింది. ఆదేశాల‌ను క‌మిష‌న‌ర్ అమ‌లు చేయ‌లేద‌ని ఉన్న‌త న్యాయ‌స్థానంలో మ‌రోసారి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కి నెల రోజుల జైలు శిక్ష‌, రూ. 2 వేల జ‌రిమాన విధించింది. జ‌న‌వ‌రి 2న హైకోర్టు రిజిస్ట్రార్ వ‌ద్ద లొంగిపోవాల‌ని హైకోర్టు ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.