హంసానందినికి క్యాన్స‌ర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): అత్తారింటికి దారేది.. మిర్చి వంటి ప‌లు చిత్రాల్లో ఐటెంసాంగ్స్ చేసిన ప్ర‌ముఖ న‌టి హంసానందిని ఇటీవ‌ల క్యాన్స‌ర్‌ బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ఇన్‌స్టా వేదిక వెల్ల‌డించారు. గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె ప్ర‌స్తుతం కాన్స‌ర్‌పై పోరాటం చేస్తున్నాని తెలిపారు. త్వ‌ర‌లోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వ‌స్తాన‌ని ఆమె అన్నారు.

జీవితంలో కాలం ఏవిధ‌మైన ప్ర‌భావాలు చూపినా.. నేను బాధితురాలిగా ఉండాల‌నుకోవ‌డం లేదు.. నేను భయం, నిరాశావాదం మరియు ప్రతికూలతతో పాలించడాన్ని నిరాకరిస్తున్నాను. ధైర్యంగా, ప్రేమతో ప్ర‌తి క‌ష్టాన్ని ఎదుర్కొని ముందుకు దూసుకుపోతాను.

18 సంవత్సరాల క్రితం క్యాన్స‌ర్ వ్యాధితో మా అమ్మను కోల్పోయాను.. ఆ నాటి నుంచి నేను అదే భ‌యంతో జీవిస్తున్నాను. 4 నెలల క్రితం, నా రొమ్ములో క‌ణ‌తి ఉన్న‌ట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్ర‌దించారు. ప‌రీక్ష‌ల అనంత‌రం నాకు రొమ్ము క్యాన్స‌ర్ గ్రేడ్‌-3 ద‌శ‌లో ఉన్న‌ట్లు వైద్యులు చెప్పారు. ప్ర‌స్తుతం స‌ర్జ‌రీ చేసి ఆ క‌ణ‌తిని తొల‌గించారు. క్యాన్స‌ర్‌ని ముందుగానే గుర్తించ‌డంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింద‌ని భావించాను. కానీ.. ఆ ఆనందం ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు. జ‌న్యూప‌ర‌మైన క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు తాజాగా వైద్యులు నిర్ధారించారు. ప్ర‌స్తుతానికి 9 విడ‌త‌ల కిమోథెర‌పీలు చేయించుకున్నాను. మ‌రో 7 చేయించుకోవాల్సి ఉంది.
ఈ మ‌హ‌మ్మారిపై దైర్యంగా న‌వ్వుతూ పోరాడాల‌నుకుంటున్నా.. సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వ‌స్తాను.. అందిరిలో ప్రేర‌ణ నింప‌డానికే ఇదంతా తెలియ‌జేశాను..“ అని హంసా నందిని పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Hamsa Nandini (@ihamsanandini)

Leave A Reply

Your email address will not be published.