కేంద్ర మంత్రి గోయల్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరం: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్ (CLiC2NEWS): ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులను ఉద్దేశించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర మంత్రిలా కాకుండా రాజకీయ నాయకుడిలా మాట్లాడారని ఆక్షేపించారు. 70 లక్షల మంది రైతుల తరఫున తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లారని హరీష్‌రావు తెలిపారు. మంగళవారం కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలన ఖండిస్తూ హరీష్‌రావు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
“కేంద్ర మంత్రి గోయల్ మంత్రులను “మీకేం పనిలేదా“ అని చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యతకరం. ఇది తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరచడమే. తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే… కేంద్ర మంత్రి తక్షణమే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా..“ అని హరీష్ రావు తెలిపారు.