TS: పొలంలో విత్తనాలు చల్లిన మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట (CLiC2NEWS): ప్రజాసమస్యలు తీర్చే పనిలో.. ప్రజల కోసం శ్రమిస్తూ.. నిత్యం ఎంతో బిజీగా ఉండే ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ (ఆదివారం) రైతు అవతారం ఎత్తారు. స్వయంగా తానే పొలంలోకి దిగి వరి విత్తనాలను వెదజల్లారు. ఆదివారం జగదేవ్‌పూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో మంత్రి రైతుగా మారాడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 బస్తాలు దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
మంత్రితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.