Olympics : బల్లెం వీరుడికి హర్యానా భారీ నజరానా..!

న్యూఢిల్లీ (CLiC2NEWS): హరియానా నుంచి వచ్చిన మరో ఆణిముత్యం నీరజ్ చోప్రా. ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి రవి కుమార్ దహియా ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీలో రజతం దక్కించుకున్నాడు. తాజాగా జావెలిన్ త్రోలో నీరజ్ ఏకంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అసమాన ప్రదర్శనతో భారతీయులందరినీ గర్వించేలా చేశాడు. ఇంతటి బల్లెం వీరుడికి హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.
ఈటెను 87.58 మీటర్లు విసిరిన ఈ అథ్లెటర్‌ను ప్రశంసిస్తూ రూ.6 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖతార్ శనివారం ట్వీట్ చేశారు. ఈ క్షణాల కోసమే యావత్ భారతావని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తోందని, దేశమంతా నీరజ్ విజయం పట్ల గర్వంగా ఉందని సిఎం ట్విటర్‌లో పోస్టు చేశారు.
टोक्यो ओलम्पिक में भाला फेंक प्रतियोगिता में स्वर्ण पदक हासिल कर भारत का नाम इतिहास के पन्नों में दर्ज करवाने पर मुख्यमंत्री श्री @mlkhattar ने @Neeraj_Chopra1 को देशवासियों की ओर से बधाई एवं शुभकामनाएँ दीं।#Tokyo2020#Cheer4India pic.twitter.com/V1mptR5bvn
— CMO Haryana (@cmohry) August 7, 2021