నీటి సుడిగాలిని చూశారా..?

భోపాల్‌ (CLiC2NEWS) : ఇప్ప‌టి వ‌ర‌కు సుడిగాలి తెలుసు.. కానీ కొత్త‌గా నీటి సుడిగాలి? ఇదంటే ఎవ‌రికీ తెలియదు.. అస‌లు నీటి సుడిగాలి అంటే ఏమిటి? అనే ప్ర‌శ్న అంద‌రికీ రావ‌చ్చే.. నీటి సుడిగాలి అంటే ఏమిలేదండీ.. గాలిలా నీరు సుడులు తిరుగుతూ.. ఆకాశానికి తాకుతుంది.. ఇది సాధ్య‌మా అని అనొచ్చు… కానీ ఈ కింది వీడియో చూస్తే సాధ్య‌మే అని మీరు కూడా ఒప్పుకుంటారు.

నిజంగానే ఒక‌ ప్రాంతంలో నీటి సుడిగాలి ఏర్పడింది. ఈ అద్భుతమైన ఘ‌టన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. సిద్ధి జిల్లాలోని దేవ్రి డ్యామ్‌ వద్ద ఈ నీటి సుడిగాలి సోమవారం సాయంత్రం ఏర్పడింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రాంతంలో తుఫాను తర్వాత నీటిని చిమ్ముతూ.. గాలి మాదిరిగా నీరు కూడా ఆకాశాన్ని తాకింది. ఈ అద్బుత దృశ్యం 15 నిమిషాలపాటు కొనసాగింది.

ఈ వింత దృశ్యాన్ని చుట్టుపక్కల గ్రామ ప్రజలు చూశారు. అది చూసిన కొంత‌మంది వారి మొబైల్‌ ఫోన్లలో వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు చూసిన నెటిజన్లు ప్రకృతిలో ఇలా కూడా జరుగుతాయా అని సందేహాలు వ్య‌క్త ప‌రుస్తునే ఆ సుంద‌ర దృశ్యాల‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.

Leave A Reply

Your email address will not be published.